ముగిసిన అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు
NEWS Sep 12,2024 10:28 am
78వ దక్షిణ మండల అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు బుధవారంతో ముగిశాయి. రాజమహేంద్రవరం సిటీ బ్యాడ్మింటన్ క్లబ్ వద్ద జరుగుతున్న పురుషులు, మహిళల వ్యక్తిగత, డబుల్స్, అండర్-19, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. గెలుపొందిన విజేతలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీ బ్యాడ్మింటన్ సంఘ సభ్యులు బహుమతులను అందజేశారు.