14న రాజమహేంద్రవరానికి మంత్రి రాక
NEWS Sep 12,2024 10:28 am
రాజమహేంద్రవరం: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల 14న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన రాజమహేంద్రవరం వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణాలు, ఆసుపత్రిలోని వసతులను పరిశీలిస్తారన్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఆసుపత్రి, కళాశాల సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.