కరప మండలం కూరాడలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా పాము కాటుకు గురై కౌలు రైతు నారాయణ మూర్తి (37) మృతి చెందారు. 5 ఎకరాల సాగు భూమిని రైతు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. చేనులో పురుగుల మందు పిచికారి చేస్తుండగా పాముకాటుకు గురయ్యారు. అతన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య సత్యవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కరప పోలీసులు తెలిపారు.