యానాంలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం రాత్రి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సందర్శించారు. ధవలేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ వరద పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అధికారులు కూడా వరద బాధితులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన సహాయక చర్యలను అందించాలని అధికారులకు ఆయన సూచించారు.