పెద్దాపురం నియోజకవర్గంలో షర్మిల పర్యటన
NEWS Sep 12,2024 06:51 am
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తుమ్మల దొరబాబు బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు విజయవాడలో రోడ్డు మార్గంలో బయలుదేరి 11గంటలకు పెద్దాపురం దర్గానగర్ సెంటర్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి మండలంలోని కాండ్రకోట గ్రామం చేరుకుని వరద ప్రాంతాలను, నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలిస్తారన్నారు.