ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బొండాయికోడు తూము సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రహదారిపై వెళ్తున్న అదుపుతప్పి పంట కాలవలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఘటన తెల్లవారుజామున జరిగినట్లు భావిస్తున్నారు. పూర్తి సమచాారం తెలియాల్సి ఉంది.