అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారిని భక్తులు మూషిక వాహనంపై ఉంచి అయినవిల్లి గ్రామ పురవీధులలో ఘనంగా ఊరేగించారు. ఈ మేరకు మేళతాళాల నడుమ స్వామివారి ఊరేగింపు మహోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని మోసేందుకు ఆసక్తి చూపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు.