ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి ప్రవాహం పెరగడంతో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కాటన్ బ్యారేజీ వద్దకు శరవేగంగా పెరుగుతున్న వరద నీటి ప్రవాహంతో గురువారం ఉదయం 6గంటకు 15.30 అడుగుల ప్రమాద స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. 15.30 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు.