ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
NEWS Sep 12,2024 07:58 am
గోకవరం మండలం రామన్నపాలెం గ్రామం వద్ద బుధవారం సాయంత్రం కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గోకవరం నుంచి వస్తున్న కారు రామన్నపాలెం గ్రామం సమీపానికి చేరుకోగా కారు టైర్ పంచ్ కావడంతో ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తల్లో భార్యకు తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు సమాచారం అందించామన్నారు.