వరద నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతిపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు హెడ్ కానిస్టేబుల్ ఎన్.వెంకట రమణ తెలిపారు. మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన గొంతిన సుబ్బారావు(35) మంగళవారం రాత్రి వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కాలనీ తుప్పల్లో సుబ్బారావు మృతదేహం లభ్యమైంది. మృతుని భార్య గొంతిన నాగమణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.