కోనసీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో 11 బైకులు దొంగలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ముమ్మిడివరంలో పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడిన ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన నాగబాబును విచారించగా 11బైకులు దొంగిలించినట్లు తేలిందన్నారు. అతడిపై కేసు నమోదు చేశామని ఆయన వివరించారు.