భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
NEWS Sep 12,2024 08:00 am
జగిత్యాల: భార్య విడిచి వెళ్లిపోయిందని మనస్తాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మోరపెల్లి గ్రామంలో జరిగింది. రూరల్ ఎస్సై సుధాకర్ వివరాల ప్రకారం.. గత 3 నెలల క్రితం చిలక రవి, గౌతమి మధ్య గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.