తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం తరఫున రూ.10 వేలు ఖర్చుతో సొంత బండ్లను ప్రభుత్వం అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ..ఏలేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. కాకినాడ జిల్లాలో ముంపు బారిన పడిన పంటలను రక్షించుకునే విధంగా చర్యలు చేపట్టి అవసరమైన రైతులకు సకాలంలో ఎరువులను అందించే ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.