పులి జాడ కోసం థర్మల్ డ్రోన్
NEWS Sep 12,2024 08:10 am
రాజానగరం మండలం దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుత సంచారాన్ని బుధవారం సాధారణ డ్రోన్‌తో గుర్తించేందుకు ప్రయత్నం చేసినా జాడ కనిపించలేదని తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్‌వో ఎస్.భరణి మీడియాకు తెలిపారు. గురువారం బెంగళూరు నుంచి థర్మల్ డ్రోన్ రప్పిస్తున్నామని తెలిపారు. అది రాత్రి, పగలు కూడా అడవిపై తిరిగి చిరుత జాడను గుర్తించగలదన్నారు. సమీప గ్రామ ప్రజలు భయాందోళనలకు గురికావద్దని సూచించారు