ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్
NEWS Sep 12,2024 08:11 am
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ముగ్గురు ఉద్యోగులను ఆలయ ఈవో రామచంద్ర మోహన్ బుధవారం సస్పెండ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ సతీశ్, రికార్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్, కోరుకొండ ఆలయ ఉద్యోగి రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. సత్యదేవుని దత్తత దేవాలయం కోరుకొండ నరసింహస్వామి ఆలయ నిధుల గోల్ మాల్‌కు సంబంధించి వీరిని బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఆ ఆలయానికి కొన్ని నెలల నుంచి నిధులు జమ కాలేదు.