తుఫానుకు కూలిన వంతెనలు
NEWS Sep 12,2024 08:11 am
పెదబయలు: పెదబయలు మండలం రూడకోట నుండి కుముడా మీదుగా జామ్‌గూడా ఒరిస్సా బోర్డర్ వరకు వేసిన తారు రోడ్డు, వంతెనల నిర్మాణంలో నాణ్యత లేక సంవత్సరం కాకముందే తుఫాన్‌కు దెబ్బతిన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, మండల కార్యదర్శి బొండా సన్నిబాబు తెలిపారు. మన్యం అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తే ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తేదారులు రోడ్డు, వంతెన నిర్మాణాల్లో నాణ్యత పాటించ లేదన్నారు. వంతెనలు కూలడంతో జనజీవనం స్తంభించి, నిత్యవసరాలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు.