దంతెవాడ వరకే విశాఖ-కిరండూల్ రైళ్లు
NEWS Sep 12,2024 08:11 am
విశాఖ: కెకె లైన్లో బచేలి-కిరండూల్ మధ్య భారీ వర్షాల వలన రైళ్ల గమ్య స్ధానం కుదించిన్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె సందీప్ తెలిపారు. సెప్టెంబరు 12 నుండి 18 వరకు విశాఖ-కిరండూల్ (18514) నైట్ ఎక్స్ ప్రెస్, విశాఖ-కిరండూల్ (08551) పాసింజరు రైలు దంతెవాడ వరకు నడుస్తాయన్నారు. అలాగే కిరండూల్-విశాఖ(18513) నైట్ ఎక్స్ ప్రెస్, కిరండూల్-విశాఖ (08552) పాసింజర్ సెప్టెంబరు 13 నుండి 19 వరకు దంతెవాడ నుండి బయలుదేరుతాయన్నారు.