ఇందిరా మహిళా శక్తి పథకం
మహిళల స్వయం సమృద్ధి
NEWS Sep 12,2024 08:14 am
వేములవాడ: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో (TSERP-DRDA) భాగంగా యమునా స్వశక్తి సంఘం వారి ఆద్వర్యంలో టైలరింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏర్పాటు చేయగా, కథలాపూర్ మండల కేంద్రంలో వినాయక స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో నాటు కోళ్ల మదర్ యూనిట్ ఏర్పాటు చేయగా ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.