ఇలాంటి కాల్స్‌తో జాగ్రత్త: సజ్జనార్
NEWS Sep 11,2024 06:53 pm
TG: ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని TGSRTC MD సజ్జనార్ హెచ్చరించారు. ‘స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటూ తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. ఇలాంటివి నమ్మకండి. అజ్ఞాత వ్యక్తుల కాల్స్‌కు స్పందించకండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని ఓ ఘటనను ఆయన పంచుకున్నారు.