దేవర చిత్రానికి సెన్సార్ పూర్తి
NEWS Sep 11,2024 06:46 pm
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2.57 గంటలుగా ఉంది. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో 56 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది.