LRS 2020 పై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
NEWS Sep 11,2024 06:47 pm
ఎల్ ఆర్ ఎస్ 2020 పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అనధికార లే ఔట్లు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం జిల్లా ప్రజలు తమ సందేహాల నివృత్తి, ఫిర్యాదుల కోసం 1800 233 1495 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యాలయం పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.