మటన్ షాప్ పై ఆరె కటికలు అభ్యంతరం.
NEWS Sep 11,2024 06:26 pm
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మటన్ షాప్ పై ఆరె కటికలు అభ్యంతరం తెలిపారు. మండల కేంద్రంలోని ఆర్.బి చికెన్ సెంటర్ నిర్వాహకుడు సయ్యద్ జావిద్ మటన్ షాప్ ప్రారంభించి మటన్ విక్రయిస్తుండగా సమాచారం తెలుసుకున్న ఆరె కటికల సంఘం సభ్యులు తమ ఉపాధి దెబ్బతింటుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పందించిన మటన్ షాప్ నిర్వాహకుడు జావేద్ తాను గ్రామపంచాయతీ నుంచి అనుమతి తీసుకుని ఇది వరకే హైదరాబాదులోని మటన్ షాపులో పనిచేసి ఉపాధి నిమిత్తం ప్రారంభించానని తెలిపాడు.