విద్యార్థులు న్యూనతా భావాన్ని వీడాలి
NEWS Sep 11,2024 06:17 pm
ఆత్మహత్యల నివారణ దినోత్సవంను పురస్కరించుకొని హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ఆధ్వర్యంలో సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్లలో చేంజింగ్ ది నారేటివ్ ఆన్ సూసైడ్స్అనే అంశంపై ప్రముఖ సైకాలజిస్ట్,తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకుంట్ల పున్నం చందర్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈసందర్భంగా సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు న్యూనతా భావాన్ని విడనాడాలని అన్నారు. సరైన సలహా, మార్గనిర్దేశనం మానసిక స్థైర్యాన్నిపెంపొందిస్తుందని తెలిపారు.