తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
NEWS Sep 11,2024 06:26 pm
సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు మాల మహానాడు హాడ్ హాక్ కమిటీ అధ్యక్షుడు ఎడ్ల సందీప్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఐక్యంగా కలిసి మెలిసి ఉన్న మాలలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బిజెపికి అమ్ముడుపోయి ఐక్యంగా ఉన్న దళితులను విడదీసే కుట్రను చేస్తూ మనువాదులతో చేతులు కలిపారని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు రామచంద్రం అన్నారు. ఎస్సీవర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించి అనంతరం తహసిల్దార్ రామచంద్రంకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.