ఇందిరా మహిళా శక్తి పై అవగాహన కల్పించాలి.
NEWS Sep 11,2024 06:25 pm
ఇందిరా మహిళా శక్తి పథకంపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని సెర్ఫ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలోభాగంగా మహిళా సంఘాలకు అందించే వివిధ పథకాలపై హైదరాబాద్ నుంచి సెర్ఫ్ కమిషనర్, అనిమల్ అండ్ హస్బండ్రి, మత్స్య నుంచి శాఖ బాధ్యులు వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల అదనపు, లోకల్ బాడీస్ కలెక్టర్లు, డీఆర్డీఓలు, వెటర్నరీ, మత్స్య శాఖ అధికారులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్,డీఆర్డీఓ శేషాద్రి పాల్గొన్నారు.