AP: వందలోపే క్వార్టర్ బాటిల్!
NEWS Sep 11,2024 05:48 pm
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త మద్యం పాలసీలో భాగంగా తక్కువ ధరకే నాణ్యమైన మద్యం తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ మద్యం బాండ్లను తీసుకురావాలని, ఎంఎన్‌సీ బాండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని ఆలోచిస్తోంది. తక్కువ ధర కేటగిరిలో క్వార్టర్ బాటిల్‌ను రూ.80 నుంచి 90 లకే అందించాలని ప్రయత్నిస్తోంది. గౌడ, ఈడిగ కులస్థులకు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.