రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NEWS Sep 11,2024 05:54 pm
అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద నాందేడ్- అకోలా 161వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక స్కూటీ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా జోగిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడు జోగిపేటలోని ఇందిరా కాలనీకి చెందిన సాయి కిరణ్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.