ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17
NEWS Sep 11,2024 04:59 pm
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొంది. నైజాం రాష్ట్ర ప్రజలకు 1949, సెప్టెంబర్ 17న నిజాం అరాచక పాలన నుంచి సైనిక చర్య ద్వారా విముక్తి కలిగించింది. నైజాం ప్రజలకు విముక్తి కలిగిన రోజును కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది.