వినాయక నిమజ్జన ప్రదేశాలలో భద్రత
NEWS Sep 11,2024 06:22 pm
అరకు: వినాయక నిమజ్జన ప్రదేశాలను బుధవారం రాత్రి అరకు సిఐ ఎల్ హిమగిరి, ఎస్ఐ ఆర్ సంతోష్
సందర్శించారు. అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో అరకులోయ, డుంబ్రిగూడ మండలాలలోని వినాయక నిమజ్జన ప్రదేశాలైన చొంపి, హట్టగూడ, కురిడి గెడ్డలను సందర్శించి గెడ్డల వద్ద పొలీసు పికెట్ లను, నిమజ్జన సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు.