వినాయక మండపాల పరిశీలన
NEWS Sep 11,2024 05:21 pm
మల్యాల పట్టణ కేంద్రంలోని పలు వినాయక మండపాలను స్థానిక సీఐ నీలం రవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రిపూట మండపాల వద్ద ఒక మనిషి పడుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని, పోలీసుల సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండప నిర్వాహకులను కోరారు.