అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి
NEWS Sep 11,2024 06:21 pm
ములుగు: అటవీ అమరుల త్యాగాలు మరువలేనివని, ప్రకృతిని కాపాడుతూ అడవులను సంరక్షించే క్రమంలో వివిధ కారణాలతో అమరులైన వారిని స్మరించుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ అన్నారు. అటవీ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అటవీ శాఖ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్వోతోపాటు ఇతర సిబ్బంది రక్తదానం చేశారు.