CM సహాయనిధి చెక్కులు పంపిణీ
NEWS Sep 11,2024 05:00 pm
MDK: రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత రావు CM సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. పలు కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది CM సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 35 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో మంజూరైన 24 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. CM సహాయ నిధి పథకం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి పాల్గొన్నారు.