అనారోగ్య సమస్యకు అండగా ఆది
NEWS Sep 11,2024 05:15 pm
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన గంగవ్వ అనారోగ్య సమస్యలకు అండగా నిలిచారు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 2,50,000/- రూపాయలు మంజూరు చేయించారు.