పేదల ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి
NEWS Sep 11,2024 05:17 pm
ములుగు: జిల్లాలోని పేదల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అపయ్య సూచించారు. ములుగు జిల్లాలోని పీహెచ్సీ వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో డీఎంహెచ్వో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు 500ల గ్రామాలకుగాను 445 గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించామని, మిగిలిన గ్రామాల్లో వైద్య శిబిరాలను 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.