ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం
NEWS Sep 11,2024 06:21 pm
కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ములుగు మండల నుంచి శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో పలువురు మంత్రిని కలిశారు. వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ములుగు మండలానికి ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. శేఖర్ గౌడ్, నరసింహారెడ్డి, నల్ల శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు.