నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి
NEWS Sep 11,2024 05:19 pm
వినాయక నిమజ్జనోత్సవాలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ కోరారు. బుధవారం మెట్‌పల్లి పట్టణంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే వాగు ప్రాంతాన్ని వారు పరిశీలించారు. వాగు ఒడ్డుకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ఉత్సవాలు రాత్రివేళ ఉంటాయని, పట్టణంలోని అన్ని వీధుల్లో వీధిలైట్లు ఉండాలని కోరారు.