వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
NEWS Sep 11,2024 06:20 pm
వెంకటాపూర్: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చీర్ల శ్రీకాంత్ అన్నారు. లక్ష్మీదేవి పేట గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 48 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి మందులను అందజేశారు. అనంతరం ఇంటింటి ఫీవర్ సర్వేను చేపట్టారు. ప్రతిరోజు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దాంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.