తొగుట మండలం ఖాన్గల్ గ్రామంలో కౌలు రైతు అప్పుల బాధకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాన్గల్ గ్రామానికి చెందిన దొమ్మాట స్వామి (32) ఐదేళ్లుగా పెద్దమాతర మల్లయ్య వద్ద పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు సరిగా పండకపోవడం, అప్పుల భారం పెరిగిపోయాయి. అప్పులు తీర్చలేక పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవికాంత్ రావు తెలిపారు.