వారం రోజుల్లో రోడ్డు పనులు
NEWS Sep 11,2024 06:16 pm
ఇటీవల కురిసిన వర్షాలకు మల్యాల మండలం బల్వంతాపూర్ లోని మెయిన్ రోడ్డు గుంతలు, బురదమయం అయ్యాయి. గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, బల్వంతాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు చొప్పదండి MLA మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి గ్రామానికి స్వయంగా వచ్చి రోడ్డును పరిశీలించారు. R&B DE, కాంట్రాక్టర్ తో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.