కూల్చివేతలపై హైడ్రా రిపోర్ట్
NEWS Sep 11,2024 11:18 am
చెరువుల FTL, బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా ప్రకటించింది. GHMC పరిధిలో 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేశామని, దాంతో 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42, అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, గగన్ పహాడ్ అప్పా చెరువు పరిధిలో 14, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13, రామ్ నగరమ మణెమ్మ గల్లీ 3, ఇతర ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలు కూల్చేశామన్నారు.