మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు. స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే రోహిత్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పలువురు క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే వారికి పలు సూచనలు చేశారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల పై దృష్టి సారించాలని దిశ నిర్దేశం చేశారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.