మోడల్ నుంచి IPSగా ఆష్నాచౌదరి
NEWS Sep 11,2024 10:35 am
ఉత్తరప్రదేశ్‌లోని పిల్కువాకు చెందిన ఆష్నా చౌదరి డిగ్రీ చదువుతుండగా కొత్త రకం ఫ్యాషన్స్, టూరిజం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉండేది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోనూ మెరిసాక, ఉన్నట్టుండి ఆ రంగాన్ని వదిలేసిన ఆష్న 2022లో సివిల్స్ రాసి ఆలిండియా 116వ ర్యాంక్ సాధించి IPSకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.