జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా
NEWS Sep 11,2024 10:38 am
జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారు అటానమస్ హోదాను జారీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన్ను కళాశాల యాజమాన్యం శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్పర్సన్ జ్యోతి, ప్రిన్సిపల్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.