చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS Sep 11,2024 10:37 am
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో MLA రోహిత్ రావు పర్యటించారు. మండలానికి సంబంధించి 129 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆయన అన్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, రామచంద్ర గౌడ్, రమేష్ రెడ్డి, కుమార్ సాగర్ ,తాసిల్దార్ రజనీకుమారి, తదితరులు పాల్గొన్నారు.