రాహుల్‌పై అమిత్ షా ఆగ్రహం
NEWS Sep 11,2024 09:59 am
జాతి వ్యతిరేక మాటలు మాట్లాడటం, దేశాన్ని ముక్కలుగా చేసే శక్తులకు మద్దతివ్వడం కాంగ్రెస్‌కు, రాహుల్‌గాంధీకి అభిరుచిగా తయారైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయత, మతం, భాషల ఆధారంగా దేశాన్ని చీల్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ ప్రకటన బయటపెట్టిందన్నారు.