ప్రతి హిందువు తమ సనాతన ధర్మాన్ని తప్పకుండా అనుసరించాలని కేదార్నాథ్‌లోని మాతాకీ శిఖర్లో ఉంటున్న మంచిర్యాలకు చెందిన మహిళ అఘోరీ తెలిపారు. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన అఘోరీకి అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. తాను 20 ఏళ్ల క్రితం నాగ సాధువు (అఘోరీ)గా మారినట్లు పేర్కొన్నారు. ఆలయానికి దిగబరంగానే మహిళా అఘోరి రావడం చర్చనీయాంశమైంది.