కూల్చేస్తాం.. తగ్గేది లేదు: సీఎం
NEWS Sep 11,2024 09:09 am
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలు అన్నింటినీ కూల్చేస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చెరువులను చెరబట్టిన వారి కోసమే హైడ్రా ఏర్పాటు చేశామని.. చెరువులను కబ్జా చేసినోళ్లను జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మూసీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 12 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.