గణేష్ నిమజ్జన రూట్ మ్యాప్ పరిశీలన
NEWS Sep 11,2024 09:00 am
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే రూట్ మ్యాప్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. స్టేషన్ రోడ్డు, గంజి రోడ్, పెద్ద బజార్, నిజాంసాగర్ చౌరస్తా మీదిగా కొత్త బస్టాండ్, ఇందిరాగాంధీ స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ తీగలు శోభయాత్ర కు ఆటంకం కలగకుండా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ పాల్గొన్నారు.