HYD: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. ఈ ఏడాది చివరికల్లా మరో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఎస్సైల ఔట్ పాసింగ్ పరేడ్లో సీఎం పాల్గొన్నారు. మా ప్రభుత్వ పని తీరుపై యువకులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. గడిచిన 9ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని.. తెలంగాణ పునర్నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.