భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
NEWS Jan 29,2026 01:03 pm
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మినీ మేడారం తోగూడెం గ్రామంలో 3 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమం సాగింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు, డా. పెండ్యాల రోజా లక్ష్మి (తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం మహాసభ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు) పాల్గొన్నారు..